![అయ్యప్ప ఆలయంలో గడ్డం వంశీ కృష్ణ ప్రత్యేక పూజలు](https://static.v6velugu.com/uploads/2024/01/special-pujas-of-gaddam-vamsi-krishna-at-ayyappa-temple-in-peddapalli-district_syw4RxVqXj.jpg)
పెద్దపల్లి జిల్లా ధర్మారం అయ్యప్ప స్వామి ఆలయంలో కాంగ్రెస్ నాయకులు గడ్డం వంశీ కృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. శబరి వెళ్తున్న అయ్యప్ప స్వాములకు ఇరుముడికి దక్షిణ ఇచ్చి.. ఆశీర్వచనం తీసుకున్నారు గడ్డం వంశీ. ఆ తర్వాత గోశాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. మొదటిసారి ధర్మారంకి వచ్చిన గడ్డం వంశీ కృష్ణకి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి వెల్ కం చెప్పారు.
అనంతరం ధర్మారం మండల కేంద్రంలోని సంజీవని హాస్పటల్ ఎండీ హాఫిజ్ కు గత కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది.. కాగా హాఫిజ్ ను గడ్డం వంశీ కృష్ణ పరామర్శించారు. త్వరగా కొలుకోవాలని కోరారు.