యాదాద్రిలో గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు

 యాదాద్రిలో గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ దంపతులు దర్శించుకుని ప్రత్యే పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన గవర్నర్ దంపతులను వేద పండితులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వందల కోట్లు ఖర్చు చేసి నవీకరించిన యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పునః ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆలయ పునః ప్రారంభానికి గవర్నర్ తమిళిసైను ఆహ్వానించలేదంటూ విమర్శలు వచ్చాయి. అయితే కాస్త ఆలస్యమైనా  తెలుగువారి కొత్త సంవత్సరాది ఆరంభ దినం అయిన ఉగాది పండుగ గవర్నర్ తమిళి సై సతీ సమేతంగా యాదాద్రికి వచ్చి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న సందర్భంగా గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ ఉగాది రోజున లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.  ప్రజలందరూ బాగుండాలని స్వామి వారిని కోరుకున్నానని తెలిపారు. తెలుగు ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. 

 

ఇవి కూడా చదవండి

సామాన్యులకో రూల్.. అధికారుల బంధువులకో రూల్

ఆర్యన్ ఖాన్ కేసులో కీలక సాక్షి మృతి

వేగంగా వ్యాపిస్తున్న మరో కొత్త వేరియంట్

రష్యా భూభాగంపై ఉక్రెయిన్ అటాక్