
నిజామాబాద్, వెలుగు : సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎడ్యుకేషన్ శాఖ స్పెషల్ సెక్రటరీ డాక్టర్ యోగి తారాణా అధికారులను హెచ్చరించారు. గురువారం ధర్మారం విలేజ్లో సోషల్ వెల్ఫేర్ స్కూల్, జూనియర్ కాలేజీను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. మెనూ ప్రకారం స్టూడెంట్స్కు భోజనం అందిస్తున్నారా.. లేదా ? అని ఆరా తీశారు.
లాబొరేటరీ, సీసీ కెమెరాలు చెక్ చేశారు. ఈ సందర్భంగా యోగితారాణా మాట్లాడుతూ స్కూల్, కాలేజీ పరిసరాల శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆమె వెంట జిల్లా ఇంటర్మీడియేట్ అధికారి రవికుమార్, జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్చిన్నయ్య, టీచర్లు తదితరులు ఉన్నారు.