Venkatesh : సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్

Venkatesh : సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్

వెంకటేష్  హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’.  మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్​ హీరోయిన్స్‌‌‌‌.  దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి  కానుకగా  జనవరి 14న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్.. తాజాగా ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్‌‌‌‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు. సంక్రాంతి ఫెస్టివల్ వైబ్‌‌‌‌ని హైలైట్ చేసేలా భీమ్స్ సిసిరోలియో ఈ పాటను కంపోజ్ చేశాడు. ఈ సందర్భంగా  వెంకటేష్‌‌‌‌, ఐశ్వర్య రాజేష్​, మీనాక్షి చౌదరి కలిసి డ్యాన్స్ చేస్తున్నట్టు రిలీజ్ చేసిన  పోస్టర్ కలర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌గా ఉంది.

  అందరూ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు.  ఈ ఎనర్జిటిక్ సాంగ్‌‌‌‌కు  భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో  వెంకటేష్ ఎక్స్ పోలీస్ పాత్రలో నటించగా,  ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నారు.  ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, వీటీ గణేష్, మురళీధర్ గౌడ్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.