సీతాదేవి రావణాసురినిపై పగ పట్టిందా..? జనకమహారాజు శ్రీరామునితో అన్న మాటలివే..!

సీతాదేవి  రావణాసురినిపై పగ పట్టిందా..?  జనకమహారాజు శ్రీరామునితో అన్న మాటలివే..!

తండ్రిమాటను కాదనలేక శ్రీరాముడు అడవిబాట పట్టాడు.  శ్రీరామచంద్రునితో పాటు.. ఆయన భార్య సీతాదేవి.. తమ్ముడు లక్ష్మణుడు కూడా వెంట వెళ్లారు.. ఆ తరువాత అడవిలో లక్ష్మణరేఖను దాటడం.. రావణాసురుడు అపహరించడం ఇదంతా  మనకు తెలిసిన విషయమే.  అయితే రావణాసురునిపై పగ తీర్చుకొనేందుకు సీతాదేవి అలా లక్ష్మణ గీతను దాటిందని పండితులు చెబుతున్నారు.  అసలు సీతమ్మ తల్లి రావణాసురునిపై  ఎందుకు పగ పెంచుకుంది. . ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. . . 

పగ తీర్చుకుంది

సీతాదేవి అబల కాదు... సీతాదేవి  కారణ జన్మురాలు.. ఆమె రావణాసురునిపై  పగతీర్చుకొనేందుకు లక్ష్మణుడు గీసిన  గీతను దాటిందని వేదాలు చెబుతున్నాయి.  కృతయుగంలో  కుశధ్వజుడు అనే రుషి కుమార్తె అయిన వేదవతి...  తనతో అనుచితంగా ప్రవర్తించిన...  రావణాసురుని మీద పగతీర్చుకునేందుకు త్రేతాయుగంలో  సీతగా జన్మించిందట! అంటే అమాయకంగా కనిపిస్తూనే అనుకున్నది సాధించిందన్నమాట సీతాదేవి. శివధనుస్సుని సైతం కదిలించగల బలవంతురాలు సీత. అందుకనే ఆ ధనుస్సుని ఎక్కుపెట్టగలిగే వీరుడే ఆమెకు సాటి రాగలడంటూ స్వయంవరాన్ని ప్రకటించారు జనకుడు. 

రామయ్యా! నీకు సీత ఎవరో తెలీదు కదా, ఇదుగో ఈమే సీత, ఈమె నా కూతురు. నేను నీకు ఈమెని కామ పత్నిగా ఇవ్వడంలేదు...  నీతోపాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లని ఇస్తున్నాను. అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామ. ... ఆడపిల్ల తండ్రిని కదా...  అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను. 

 కాబట్టి నన్ను క్షమించు...  ఈమెని నువ్వు పుచ్చుకో...  నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో( సూర్యవంశం వాళ్ళకి అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటే సుముహుర్తం...  మనం జీలకర్ర-బెల్లం పెడతాం సుముహుర్తానికి)... ఈ క్షణం నుంచి మా అమ్మాయి ఏది చేసినా అది..  తన  భర్త అయిన  నీ కోసమే చేస్తుందని జనకమహారాజు .. శ్రీరామచంద్రునితో సంభాషించాడు..

 రామ..  మాది విదేహ వంశం, మాకు దేహమునందు భ్రాంతి ఉండదు...  నా కూతురిని అలా పెంచాను. ఒక ఏడాది తరువాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సంప్రదాయాన్ని మరిచిపోతే...  అది నీ వల్లే రామ, ఎందుకంటే నేను నేర్పినదాన్ని భర్త ఉద్ధరించాలి, ఆ ఉద్ధరించడంలో పొరపాటు వస్తే అది నీదే అవుతుంది, ఆమె నిన్ను నీడలా అనుసరిస్తుంది.