బౌద్ధ మత సాహిత్యం: ప్రత్యేక కథనం

బౌద్ధ మత సాహిత్యం: ప్రత్యేక కథనం

బౌద్ధసాహిత్యం పాళి, సంస్కృతం భాషల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హీనయాన బౌద్ధ మత గ్రంథాలు పాళి భాషలో రాయగా, మహాయాన బౌద్ధులు సంస్కృతంలో గ్రంథాలు రాశారు. బుద్ధుని జీవిత చరిత్రకు జాతక కథలు, సుత్తనిపాతం, దీపవంశ, మహావంశ అనే సింహళ బౌద్ధ గ్రంథాలు, బౌద్ధమత మూల గ్రంథాలైన త్రిపీటకాలు, మహావస్తు, లలిత విస్తారం, బుద్ధ చరితం, దిఘని నికాయ, నిదన కథ, అభినిష్క్రమణ సూత్ర ప్రామాణిక గ్రంథాలుగా పరిగణిస్తారు. 

త్రిపీటకలు

త్రిపీటకలు అంటే బోర్లించిన మూడు గంపలు. సుత్తపీటక, వినయ పీటక, అభిదమ్మ పీటల అనేవి త్రిపీటకలుగా పిలుస్తారు. ఇవి హీనయాన బౌద్ధానికి ముఖ్యమైనవి. పాళి భాషలో రాశారు. త్రిపీటకలపై వ్యాఖ్యానాలు రాసిన ప్రముఖ బౌద్ధమత సన్యాసి బుద్ధఘోషుడు. 

సుత్తపీటక

సుత్తపీటకను ఆనందుడు సంకలనం చేశాడు. ఇది త్రిపీటకల్లో ముఖ్యమైంది. అతి పెద్దది. బుద్ధుడి ఉపదేశాలు, బోధనలు, తాత్విక విచారాలను వివరిస్తాయి. సుత్తపీటకను ఐదు భాగాలుగా విభజిస్తారు. వీటిని నికయలు అంటారు. 

  • దిఘనికయ: ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గాలు కనిపిస్తాయి. దిఘనికయపై అశ్వఘోషుడు సుమంగళ విలాసిని అనే వ్యాఖ్యానం రాశాడు. 
  • అంగుత్తరనికయ: ఇది మహాజనపదాల గురించి పేర్కొన్నది. 
  • మజ్జిమనికయ: బుద్ధుడికి జైనులు, అజీవకులతో ఉన్న సంబంధాలను వివరిస్తుంది.
  • ఖుద్దకనికయ: బుద్ధుడి పూర్వ జన్మల గురించి తెలిపే జాతక కథలుఉన్నాయి. జాతక కథల వల్ల ఆనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయి. ఇది అతిపెద్దనికయ. 

వినయ పీటక

వీనయ పీటకను ఉపాలి సంకలనం చేశారు. ఇందులో బౌద్ధ మతం ప్రవర్తన నియమావళి, నిబంధనలు, మార్గదర్శక సూత్రాల గురించి పేర్కొన్నారు. ఇందులో అజాత శత్రువు తన తండ్రి అయిన బింబిసారుడుని చంపి సింహాసనం అధిష్టించినట్లు ఉన్నది. ఇందులో ఉన్న ముఖ్యమైన భాగాలు సుత్తవిభాంగ, ఖండక, పరివార. 

అభిదమ్మ పీటక

అభిదమ్మ పీటకను మొగ్గలిపుత్త తిస్స సంకలనం చేశారు. ఈ గ్రంథం బౌద్ధతత్వాన్ని వివరించారు. అంటే ప్రవచనాలు, బోధనలు ఉన్నాయి. ఇది సుత్తపీటక, వినయపీటక వేదాంతసారం. ఈ పీటకలోని వాదోపవాదాలతో రూపొందించిన గ్రంథం కథావత్తు. 
ఇతర హీనయాన గ్రంథాలు

  • మిలిందపన్హా: బాక్ట్రియన్​ రాజు మినాండర్ కు, అతని ఆస్థానంలో ఉన్న నాగసేనుడికి మధ్య జరిగిన ప్రశ్నలు, జవాబులు మిళిందపన్హాగా రూపొందింది. 
  • దివ్యవదన: ఇది టిబెట్​ గ్రంథం.
  • శ్రీలంక ప్రాంత గ్రంథాలు: దీపవంశ 350 ఏడీ, మహావంశ(దీపవంశ కొనసాగింపు), వంశతపకాసిని(మహావంశంపై వ్యాఖ్యానం), కులవంశ.

జాతక కథలు

ఇవి మహాయాన బౌద్ధులు రచించిన గ్రంథాలు. ఇవి బుద్ధుని పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించారు. జాతక కథలు బుద్ధుడు ఉన్నత జన్మ పొందడం కోసం అనేకసార్లు జన్మించాడని తెలియజేస్తాయి. సుత్తపీటక చివరి భాగమైన ఖద్దకనికయలో 547 జాతక కథలు ఉన్నాయి. వీటిలోని అధిక భాగం నీతికథలు. జాతక కథలన్నింటిలో బోధిసత్వుడు కథానాయకుడుగా ఉంటారు.  

బౌద్ధ సంఘం

బౌద్ధం ప్రపంచ చరిత్రలోనే మొదటి మత సంస్థ. దీనికి గల పేరు సంఘ. దీనిని ప్రజాపతి గౌతమి, ఆనందుని కోరిక మేరకు బుద్ధుడు స్థాపించాడు. బుద్ధుడి అసలైన ఐదుగురు శిష్యుల్లో ఒకడైన అస్సాజి తొలి బౌద్ధ భిక్షువులైన సరిపుత్ర, మొగ్గల్లన బౌద్ధమతంలోకి మార్చారు. 
బుద్ఢుడి ప్రముఖ అనుచరులు
ఆనంద (బుద్ధుడి సహచరుడు, ముఖ్య శిష్యుడు)
కాశ్యప (బుద్ధుడి శిష్యుల్లో ముఖ్య పండితుడు)
ఉపాలి (నాయీ బ్రాహ్మణ కులం)
యస (అత్యంత ఐశ్వర్యపండితుడు)

బౌద్ధం స్వీకరించేవారు చేయాల్సినవి
    

  • 15 సంవత్సరాల వయస్సులో తల్లిదండ్రుల ఆమోదంతో బౌద్ధాన్ని స్వీకరించడాన్ని పబ్జజవ్రతం అంటారు.
  • కాషాయ వస్త్రాలు ధరించాలి.
  • కేశఖండన పాటించాలి.
  • భిక్షువుల వద్ద రెండు జతల కాషాయ రంగు వస్త్రాలు, ఒక సూది, దారం, భిక్షపాత్ర ఉండాలి.
  • బుద్ధం శరణం గచ్ఛామి అని స్మరించాలి.
  • బౌద్ధ సంఘం లోనికి రాకూడనివారు: బానిసలు, సైనికులు, నేరగాళ్లు, కుష్టు, మూర్చ రోగగ్రస్తులు, రుణగ్రస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు.
  • బౌద్ధ భిక్షువులు త్యజించాల్సిన అంశాలు
  • దొంగతనం చెప్పడం
  • శృంగారంలో పాల్గొనడం
  • అబద్ధం చెప్పడం
  • మత్తుపదార్థాలు వాడటం
  • మధ్యాహ్నం తర్వాత భోజనం చేయడం
  • సుగంధపూరిత వస్తువులు వాడటం
  • ఆహ్లాదకార్యకలాపాలకు దూరంగా ఉండటం.
  • ఆభరణాలను ధరించడం.

స్త్రీ సన్యాసులకు సంబంధించినవి

  • తొలుత బౌద్ధ సంఘంలోకి స్త్రీలు ప్రవేశరాదనే నియమం ఉండేది. కానీ, ప్రజాపతి గౌతమి, ఆనందుడు గట్టిపట్టుపట్టడంతో బౌద్ధ సంఘంలోకి స్త్రీలను అనుమతించారు. మహిళా బౌద్ధ సన్యాసినులను భిక్షుణి లేదా బిక్కుని అంటారు. సంసార జీవితాన్ని గడిపే మహిళా బౌద్ధ సన్యాసినులను ఉపాసిక అంటారు. 
  • గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీ బౌద్ధ సంఘ ప్రవేశానికి అనర్హురాలు. పసిపిల్లలు ఉన్న  స్త్రీకి ప్రవేశం లేదు.
  • భర్త లేదా తల్లిదండ్రుల అనుమతి అవసరం. 


బౌద్ధ సంగీతులు

బౌద్ధమత సమావేశాలు, సభలకు మరో పేరు సంగీతులు. వీటిని పౌర్ణమి, విదియ రోజుల్లో నిర్వహించే వారు. 

మొదటి బౌద్ధ సంగీతి

  • మొదటి సమావేశం ముఖ్యోద్దేశం బుద్ధుడి బోధనలను గ్రంథ రూపంలోకి మార్చడం. ఈ సంగీతిలోనే బుద్ధుడి మొత్తం ఉపన్యాసాలను ఆనందుడు సుత్తపీటక రూపంలో రాశాడు. 
  • బుద్ధుడి శిష్యుడు ఉపాలి వినయ పీట రాశాడు. ఈ గ్రంథాల్లో ఆనందుడు బౌద్ధ నిర్వాణం కోసం రాజగృహ, కాశీ, శ్రావస్తి, చంప, కౌశాంబి, సాకేత అనే ఆరు నగరాలను తరచూ పేర్కొన్నాడు. కానీ బుద్ధుడు కుషి నగరాన్ని ఎంపిక చేసుకున్నాడు. 

రెండో బౌద్ధ సంగీతి

అవింతి సన్యాసులు, వజ్జి సన్యాసుల మధ్య ఏర్పడిన సిద్ధాంతపరమైన సమస్యలను తొలగించడానికి రెండో సమావేశం సబాకామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బౌద్ధమతంలో చీలిక వచ్చింది. 

మూడో బౌద్ధ సంగీతి

స్థవిరవాదులను నిజమైన బౌద్ధసన్యాసులుగా మొగ్గలిపుత్త తిస్స పేర్కొన్నాడు. ఈ బౌద్ధ సంగీతిలో అభిదమ్మ పీటకను సంకలనం చేయడంలో మొగ్గలిపుత్త తిస్స లేదా ఉపగుప్తుడు కీలక పాత్ర పోషించారు. మొగ్గలిపుత్త తిస్సను శ్రీలంక అశోకుడిగా పిలుస్తారు. ఇందులో భాగంగానే బౌద్ధమతం దేశంలోనూ విదేశాల్లోనూ ప్రచారం చేయడానికి మహామాత్రలు ఏర్పడ్డాయి.

నాలుగో బౌద్ధ సంగీతి

ఈ బౌద్ధ సంగీతి జరిగే కాలం నాటికి బౌద్ధమతం 18 శాఖలుగా చీలిపోయింది. ఈ చీలిపోయిన 18  మత శాఖల మధ్య సయోధ్య కుదర్చడానికి నాలుగో బౌద్ధసంగీతిని ఏర్పాటు చేశారని హుయాన్​త్సాంగ్​తన రచనల్లో పేర్కొన్నాడు. ఈ సమావేశంలో 18 శాఖలను ప్రధానంగా రెండు శాఖలుగా మార్చారు. అవి.. హీనయానం, మహాయానం. సంగీతిలోనే వసుమిత్రుడు మహావిభాగ శాస్త్ర అనే గ్రంథాన్ని రచించాడు.   

బుద్ధఘోషుడు

  • హీనయాన మతశాఖకు చెందినవాడు. బుద్ధఘోషుడు విసుమగ్గ అనే గ్రంథాన్ని రచించాడు. క్రీ.శ. ఐదో శతాబ్దం నాటికి హీనయానం అంతరించే స్థాయికి చేరుకున్నది. ఆ సమయంలో బుద్ఢఘోషుడు శ్రీలంక, బర్మాకు వెళ్లి హీనయానానికి సంబంధించిన రచనలను తీసుకువచ్చి భారత్​లో హీనయానాన్ని సంస్కరించారు. 
  • బుద్ధఘోషుని వ్యాఖ్యానాలు
  • వినయపీటక – సామంత  ప్రసాదిక
  • అభిదమ్మ పీటక – కథావత్తు ప్రకరణ
  • సుత్తపీటక – సుత్తపీటకలోని ఐదు నికయలపై రాసిన వ్యాఖ్యానాలు
  • అశ్వఘోషుడు
  • అశ్వఘోషున్ని ఇండియన్​ మిల్టన్​గా పేర్కొంటారు. ఈయన సంస్కృతంలో రాసిన గ్రంథాలు.. బుద్ధ చరితం, సత్ప్రవర్తన, ఆదర్శ జీవనం, బౌద్ధం వ్యాప్తికి ఎంతో దోహదపడ్డాయి.