స్వామి వివేకానంద.. ప్రత్యేక కథనం

స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఈయన 1863లో కలకత్తాలో జనవరి 12న జన్మించాడు. వివేకానందుడి తల్లిదండ్రులు భువనేశ్వరి దేవి, విశ్వనాథ్​ దత్తా. 1863లో సచ్చిదానంద పేరుతో ఉన్న నరేంద్రనాథ్​ దత్తాకు ఖేత్రి మహారాజు అజిత్​సింగ్​ వివేకానందుడు అని పేరు పెట్టాడు. ఈయనను కర్మయోగి, హిందూ మత ఆధ్యాత్మిక రాయబారి అనే బిరుదులతో పిలుస్తారు.  రామకృష్ణ పరమహంస ముఖ్య శిష్యుల్లో ఒకరైన వివకానంద తన గురువు నుమొదటగా 1881లో కలిశాడు. 1902, జులై 4న పశ్చిమబెంగాల్​లోని బేలూరు ఆశ్రమంలో వివేకానందుడు మరణించాడు. ఈయన జన్మదినాన్ని భారత ప్రభుత్వం 1984లో జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించి 1985 నుంచి జరుపుకుంటున్నారు. 

ఈయన నవవిధాన్​(కేశవ చంద్రసేన్), సాధారణ బ్రహ్మసమాజ్, బ్రహ్మసమాజ్​ అనే సంస్థల్లో సభ్యుడిగా ఉన్నాడు. అందరికీ అనువుగా లేని కుల వ్యవస్థను ఖండించాడు. భారత సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలను వ్యతిరేకించాడు. ఈయన బోధించిన మానవ విలువలకు ఆధారం ఉపనిషత్తులు, గీత, బుద్ధ పేర్కొన్న అంశాలేనని తెలిపాడు. తన మిషన్​లో భాగంగా పరమార్థ, వ్యవహారాల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించాడు. ఆకలితో ఉన్న మనిషికి మతం గురించి చెప్పడం దేవున్ని కించపరచడమే అని అన్నాడు. 
    
 హిందీని జాతీయ భాషగా ప్రకటించిన మొదటి వ్యక్తిగా వివేకానందుడిని చెప్పవచ్చు. విద్య అనేది ఒక వ్యక్తి స్వభావాన్ని, గుణాన్ని మార్చే విధంగా ఉండాలని, అలాంటి విద్యనే ప్రచారం చేశాడు. 1893, సెప్టెంబర్ 11లో చికాగోలో జరిగిన మొదటి ప్రపంచ మతాల పార్లమెంట్​లో భారతదేశం, హిందూమత ప్రతిష్టను ఉన్నత శిఖరాలకు చేర్చాడు. ఈ సదస్సులో పాశ్చాత్య దేశాల భౌతికవాదం, తూర్పు దేశాల ఆధ్యాత్మికవాదం రెండింటి మిశ్రమం మానవాళి సంతోషానికి ఉపయోగపడుతుందని, దానివల్ల సామరస్యం పెరుగుతుందని పేర్కొన్నాడు. ఈ సమ్మేళనంలో పాల్గొన్న వారందరిలో మహోన్నత వ్యక్తి వివేకానందుడని న్యూయార్క్ హెరాల్డ్​ అనే అమెరికా పత్రిక కీర్తించింది. 1895లో న్యూయార్క్​లో మొదటి వేదాంత సొసైటీని స్థాపించాడు. 

  • ఇతని తత్వం: ఆధునిక వేదాంత
  • రచనలు: డివైన్ లైఫ్, రాజయోగ, కర్మయోగ, భక్తియోగ, జ్ఞానయోగ, నా గురువు, లెక్చర్స్​ ఫ్రం కొలంబో టూ అల్మోరా, వర్తమాన్ భారత్.
  • స్థాపించిన పత్రికలు: ప్రబుద్ధ భారత్​ (ఆంగ్ల మాస పత్రిక), ఉద్బోధ (బెంగాలీ పక్షపత్రిక) 
  • స్థాపించిన సంస్థలు: రామకృష్ణ మిషన్​ (1897, బేలూరు) ఇది ఒక సామాజికపరమైన, ఆధ్మాత్మిక సేవా సంస్థ.
  • రామకృష్ణ మఠ్ (1897, బేలూరు) ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ.

వివేకానందుడిపై వ్యాఖ్యలు

  • వివేకానంద సేవ్డ్​  హిందూయిజం. సేవ్డ్​ ఇండియా – రాజగోపాలచారి
  •  వివేకానందను ఆధునిక భారత నిర్మాతగా సుభాష్​చంద్రబోస్ వర్ణించాడు.
  •  సృష్టికే మేధావి అని ఠాగూర్​ వర్ణించాడు.
  •  భారతదేశాన్ని ఆధ్యాత్మికతతో మేలుకొల్పినవాడు – అరబిందో ఘోష్