జనగామ అర్బన్, వెలుగు : ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్ వైర్ చోరీలపై ప్రత్యేక నిఘా పెడుతామని జనగామ ఏసీపీ దామోదర్‌రెడ్డి చెప్పారు. ఎలక్ట్రిసిటీ ఆఫీసర్లతో శనివారం నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కాపర్ వైర్ చోరీలను నియంత్రణకు పోలీసులు, విద్యుత్ ఉద్యోగులు కోఆర్డినేషన్‌తో పనిచేయాలని సూచించారు. వేసవిలో ఎక్కువగా చోరీలు జరిగే అవకాశం ఉన్నందున రైతులు అలర్ట్‌గా ఉండాలన్నారు.
గ్రామాల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చోరీల నియంత్రణకు గ్రామాల్లో జూనియర్ లైన్‌మెన్లు, హెల్పర్లు, గ్రామ కార్యదర్శులతో ప్రత్యేక కమిటీలు వేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సై సృజన్‌కుమార్, విద్యుత్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, ఏడీఈ మనోహర్‌రెడ్డి, ఏఈలు అనిల్‌కుమార్, సతీశ్, నర్సింహారెడ్డి, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.