పొల్యూషన్ కంట్రోల్ పై స్పెషల్ టాస్క్ ఫోర్స్

న్యూఢిల్లీ, వెలుగు : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. జీఆర్ఏపీ–4 ఆంక్షల అమలును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడానికి ఆరుగురు సభ్యులతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు.

ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమిటీకి  ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌గా పర్యావరణ శాఖ స్పెషల్ సెక్రటరీని నియమించినట్లు తెలిపారు. మరో రెండు మూడు రోజులపాటు ఢిల్లీలో గాలి నాణ్యత పేలవమైన కేటగిరీలో ఉండబోతోందన్నారు. గాలుల వేగం పెరిగే వరకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) వెరీ పూర్ కేటగిరీలోనే ఉంటుందని చెప్పారు.

ALSO READ: మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఐల .. పెట్టుబడులు రూ.54 లక్షల కోట్లు