వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంట్లో సోదాలు

వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంట్లో సోదాలు
  • కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఏపీ పోలీసులు 

గచ్చిబౌలి, వెలుగు: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు చేపట్టారు. శనివారం హైదరాబాద్  రాయదుర్గం మై హోం భుజాలోని వంశీ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్  హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకొని విజయవాడకు తరలించారు. 

ఇప్పటికే వంశీని విజయవాడ పడమట పోలీసులు అరెస్ట్​ చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్​ను కిడ్నాప్  చేసి బెదిరించినట్లు వంశీపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు.