పండగలను పురస్కరించుకొని టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) అర్బన్ క్రూయిజర్ టైజర్ లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇది రూ. 20,160 విలువ కలిగిన టయోటా జెన్యూన్ యాక్సెసరీస్ (టిజిఏ) ప్యాకేజీతో వస్తుంది. ఈ బండిలోని1.0 లీటర్ఇంజన్కు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్
6 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. లీటరుకు 21.5 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టివిటీ ఆప్షన్లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఏబీఎస్, ఈబీడి, ఎయిర్‌బ్యాగ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.