ఉత్తర భారత పుణ్యక్షేత్రాల సందర్శనకు.. 23న స్పెషల్ ట్రైన్

ఉత్తర భారత పుణ్యక్షేత్రాల సందర్శనకు.. 23న స్పెషల్ ట్రైన్

హైదరాబాద్​సిటీ, వెలుగు: నార్త్​ ఇండియాలో ప్రఖ్యాతి గాంచిన పుణ్య క్షేత్రాలను సందర్శించాలనుకునే వారి కోసం ఐఆర్ సీటీసీ ప్రత్యేక రైలును నడపనుంది. హరిద్వార్, రుషికేశ్​, వైష్ణోదేవి, అమృత్​సర్, ఆనంద్​పూర్​ తదితర ప్రదేశాలను చూడాలనుకునే తెలంగాణ, ఏపీ వాసుల కోసం స్పెషల్​ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. 

విజయవాడ నుంచి ప్రారంభమయ్యే భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మానసాదేవి ఆలయం, హర్- కీ -పౌరీ (సాయంత్రం)వద్ద గంగా -హారతి, రామ్ జూలా, లక్ష్మణ్ జూలా, ఆనంద్ సాహిబ్ గురుద్వార్, నైనా దేవి ఆలయం, గోల్డెన్ టెంపుల్ , వాఘా బోర్డర్‌ (సమయం అనుమతిస్తే) వంటి ప్రదేశాలను వెళ్లనుంది. ఈ రైలు విజయవాడతో పాటు గుంటూరు, తెలంగాణలోని నల్గొండ, సికింద్రాబాద్, కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్  స్టేషన్లలో ఆగుతూ వెళ్తుంది.10 రోజుల పాటు కొనసాగే ఈ యా త్ర ఈ నెల  23న మొదలవుతుందని రైల్వే 
అధికారులు తెలిపారు.