సికింద్రాబాద్–లక్నో స్పెషల్ ​రైలు

సికింద్రాబాద్, వెలుగు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా  దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్,​ -లక్నో మధ్య స్పెషల్​ రైలు ను ప్రారంభించింది. ఈ రైలు శుక్రవారం సాయంత్రం 7 గంటలకు సికింద్రాబాద్ నుంచి లక్నోకు బయలుదేరగా.. ఆదివారం సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుంది. 

ఈ నెల 18, 25 తేదీల్లో లక్నో నుంచి సికింద్రాబాద్​కు  బయలు దేరుతుందని అధికారులు తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, విజయనగరం, దువ్వాడ, భువనేశ్వర్, కటక్, గయా, వారణాసి, అయోధ్య స్టేషన్లలో ఆగుతుందని, 3 ఏసీ కోచ్​లు ఉన్నాయని చెప్పారు.