కాజీపేట - తిరుపతి మధ్య 10 స్పెషల్‌‌ రైళ్లు

కాజీపేట - తిరుపతి మధ్య 10 స్పెషల్‌‌ రైళ్లు

హైదరాబాద్‌‌, వెలుగు : ప్యాసింజర్స్‌‌ రద్దీ పెరుగుతుండటంతో కాజీపేట–తిరుపతి మధ్య10స్పెషల్‌‌ ట్రైన్స్‌‌ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 30వ తేదీతోపాటు వచ్చే నెలలోని అన్ని మంగళవారాల్లో కాజీపేటలో ఉదయం 11గంటలకు ట్రైన్‌‌ స్టార్ట్‌‌ అవుతుందని పేర్కొంది. ఇదే రోజుల్లో తిరుపతిలో కూడా రాత్రి 11.40గంటలకు రైలు బయలుదేతుందని చెప్పింది. ఈ రైళ్లు వరంగల్‌‌, కేసముద్రం, మహబూబాబాద్‌‌, డోర్నకల్‌‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని వెల్లడించింది. 

 

ఇవి కూడా చదవండి

దేశంలోనే తొలి విండ్-సోలార్ హైబ్రిడ్ పవర్ ప్లాంట్‌‌‌‌ ప్రారంభం

2 రోజుల్లో కేరళకు రానున్న రుతుపవనాలు

ఏడాది చివరి నాటికి కొత్త పంబన్ వంతెన పూర్తి

శ్రీలంకలో 50 రోజులుగా కొనసాగుతున్న నిరసనలు