సికింద్రాబాద్, వెలుగు : దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆఫీసర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాచిగూడ-– తిరుపతి, తిరుపతి– -కాచిగూడ మధ్య ఏడు చొప్పున, సికింద్రాబాద్– తిరుపతి, తిరుపతి– -సికింద్రాబాద్ మధ్య 14 చొప్పున సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. కాచిగూడ– -తిరుపతి మధ్య నడిచే రైలు ఉమ్‌దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్సిటీ, డోన్, గుత్తి, ఎర్రగుంట, కడప
రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందన్నారు. అలాగే సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నడిచే రైళ్లు జనగామ, కాజిపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందన్నారు. ఈ రైళ్లు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 16 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.