![NBK109: నందమూరి ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. బాలయ్య బర్త్ డేకి స్ప్రెషల్ ట్రీట్](https://static.v6velugu.com/uploads/2024/05/special-treat-from-nbk-109-movie-for-balakrishna-birthday_Popzketm1W.jpg)
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కమర్షియల్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబట్టింది. ఇక ఈ సినిమా తరువాత టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ కొల్లితో NBK109 సినిమా చేస్తున్నారు బాలయ్య. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులను, మరీ ముఖ్యంగా నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ టీజర్ తరువాత సినిమాపై అంచనాలు కూడా బాగా పెరిగాయి.
ఇక తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. జూన్ 10 బాలకృష్ణ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నారట మేకర్స్. అదేంటంటే.. బాలయ్య బర్త్ డే సందర్బంగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేయనున్నారట. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారు, ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.