గ్రేటర్ హైదరాబాద్ లో విద్యుత్ నిలిచిపోతే ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ దగ్గర డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీ వెహికల్స్ జెండా ఊపి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇందన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎండీ లు ముషారఫ్ అలీ, వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందిచేందుకు అంబులెన్స్ తరహాలో స్పెషల్ వెహికల్స్ అందుబాటులోకి తీసుకొచ్చామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ సరఫరా లో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే.. వెంటనే పునరుద్ధరించేందుకు అంబులెన్స్ తరహాలో CBD (సెంట్రల్ బ్రేక్ డౌన్) విభాగాన్ని పటిష్టపరిచేందుకు అన్ని డివిజన్ ఈ ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీ వెహికల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఇవి 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని ఆయన అన్నారు. విద్యుత్ సమస్య ఉంటే..
Also Read :- గ్రూప్-1 పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు నిరాకరణ
1912 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేస్తే వెంటనే అత్యవసర సేవల సిబ్బంది అందుబాటులోకి వస్తారని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో 57 సబ్ డివిజన్ లు ఉంటే.. ప్రతి డివిజన్ కు ఒక వాహనాన్ని కేటాయించామన్నారు. రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా సేవలను విస్తరిస్తున్నమన్నారు ఆయన. ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే తక్షణమే సిబ్బంది అవసరమైన యంత్ర పరికరాలతో పూర్తిస్థాయిలో స్వల్ప వ్యవధిలోనే పునరుద్ధరణ చేపడతారని ఉపముఖ్యమంత్రి వివరించారు. ప్రతి వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ముగ్గురు లైన్స్ సిబ్బంది అవసరమైన మెటీరియల్ తో 24 గంటల పాటు సిద్ధంగా ఉండనున్నారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందిచేందుకు అంబులెన్స్ తరహాలో ప్రత్యేక విద్యుత్ వాహనాలు
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) October 21, 2024
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 57 సబ్ డివిజన్ లకు 57 వాహనాలను కేటాయిస్తూ ఈ రోజు డా. బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు ప్రారంభించడం జరిగింది
ప్రతి వాహనంలో… pic.twitter.com/qBg0Y0HfxI
ప్రతి వాహనము లో ధర్మో విజన్ కెమెరాలు, పవర్ రంపము మిషన్, నిచ్చెనలు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, కేబుల్స్ అవసరమైన అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ పరికరాలు ఈ ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీ వెహికల్స్ లో సిద్ధంగా ఉండనున్నాయి. ఈ వాహనంలో ఎర్త్ రాడ్లు, హెల్మెట్ వంటి అన్ని భద్రతా పరికరాలు ఉంటాయి. ట్రాన్స్ ఫర్మర్లను లాగగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఉపముఖ్యమంత్రి వివరించారు.