స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ రెగ్యులర్ ప్రాతిపదికన 1,511 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 4వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీలు: మొత్తం 1,511 పోస్టుల్లో డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అండ్ డెలివరీ: 187, డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్‌ఫ్రా సపోర్ట్ అండ్ క్లౌడ్ ఆపరేషన్స్: 412, డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)-
నెట్‌వర్కింగ్ ఆపరేషన్స్: 80, డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఐటీ ఆర్కిటెక్ట్: 27, డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)-
ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ: 7, అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్): 798 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు www.sbi.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.