
బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) సీ అండ్ ఐసీ విభాగంలో వివిధ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
పోస్టులు: మొత్తం 157 పోస్టుల్లో రిలేషన్ షిప్ మేనేజర్ 66, క్రెడిట్ అనలిస్ట్ 74, ఫారెక్స్ అక్విజిషన్ అండ్ రిలేషన్ షిప్ మేనేజర్ 17 ఖాళీగా ఉన్నాయి.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
అప్లికేషన్స్: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మే 17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.bankofbaroda.in వెబ్సైట్లో సంప్రదించాలి.