చాలా మంది టాలెంట్ ఉన్నా.. నేర్చుకోవాలన్న తపన, పట్టుదల ఉన్నా.. సాయమందించే చేయి తోడు లేక వెనకే ఉండిపోతారు. ఆత్మవిశ్వాసానికి తోడుగా సరైన సౌకర్యాలూ ఉంటే.. వారు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడమనేది అంత పెద్ద విషయమేం కాదు. అలాంటి లక్షణాలున్న ఓ బాలుడు.. తల కలలను సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాడు.
జమ్మూ కశ్మీర్ లోని హంద్వారాలో అంగవైకల్యం ఉన్న పర్వైజ్ అనే బాలుడు.. తన ఒంటి కాలుతోనే పాఠశాలకు వెళ్తూ తన ఆత్మ స్థైర్యాన్ని చాటుకుంటున్నాడు. రోజూ 2 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ.. ఉన్న ఒక్క కాలితోనే బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. అసలే అంగవైకల్యం... కనీసం అనుకున్న లక్ష్యాన్నైనా చేరుకుందామంటే.. తగిన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. రోడ్లు కూడా బాగోలేకపోవడంతో.. రోజూ ఎన్నో అవస్థలు పడుతున్నాడు పర్వైజ్. తనకు కృత్రిమ అవయవం లభిస్తే, నడవగలనని... తన జీవితంలో ఏదైనా సాధించాలనే కల ఉందని పర్వైజ్ తన మనసులోని మాటను వెల్లడించాడు.
#WATCH| Specially-abled boy walks to school on one leg to pursue his dreams in J&K's Handwara. He has to cover a distance of 2km while balancing on a one leg
— ANI (@ANI) June 3, 2022
Roads are not good. If I get an artificial limb,I can walk. I have a dream to achieve something in my life, Parvaiz said pic.twitter.com/yan7KC0Yd3
అనుకుంటే ఏదైనా సాధించాగలమన్న పదాన్ని నిజం చేస్తూ... సాగిపోతున్న పర్వేజ్ యాతన చూసిన ఓ మహానుభావుడు మానవత్వాన్ని చాటుకున్నారు. దీనస్థితిలో ఆ బాలుడు పాఠశాలకు వెళ్లడం చూసి, చలించి జైపూర్ ఫూట్USA ఛైర్మన్ ప్రేమ్ బండారీ.. అతనికి ఉచితంగా కృత్రిమ అవయవం అందిస్తానని పెద్ద మనసు చాటుకున్నారు.
Jaipur Foot USA Chairman Prem Bhandari promises free artificial limb to specially-abled Parvaiz from J-K
— ANI Digital (@ani_digital) June 4, 2022
Read @ANI Story | https://t.co/auDbnE9pF6#JammuAndKashmir #Parvaiz #artificiallimb #support #Jammu pic.twitter.com/PeXLLEnTru
మరిన్ని వార్తల కోసం...
మానవత్వం చాటుకున్న తొర్రూర్ తహసీల్దార్
ఈ నెలలోనే మరో 3 నోటిఫికేషన్లు!