పోటీ పరీక్షల ప్రత్యేకం : ​ కాంగ్రెస్​ మహాసభ నుంచి ఆపరేషన్​ పోలో దాకా

పోటీ పరీక్షల ప్రత్యేకం : ​ కాంగ్రెస్​ మహాసభ నుంచి ఆపరేషన్​ పోలో  దాకా
  • బ్రిటీష్​ ఇండియాలో చాంబర్​ ఆఫ్​ ప్రిన్సెస్​ అధ్యక్షుడు భూపాల్​ నవాబు సంస్థానాల్లో ప్రాతినిధ్య ప్రభుత్వానికి భిన్నంగా బాధ్యతాయుత ప్రభుత్వాలను ఏర్పరచే ప్రశ్న తలెత్తదని 1944 జులై 26న నిజాం ప్రభుత్వం ప్రకటించింది.
  • నిషేధం తొలగించిన తర్వాత హైదరాబాద్​ స్టేట్​ కాంగ్రెస్​ మహాసభ 1947 జూన్​ 16 , 17, 18వ తేదీల్లో ముషీరాబాద్​ మైదానంలో జరిగింది.
  • 1947 జూన్​లో​ జరిగిన హైదరాబాద్​ స్టేట్​ కాంగ్రెస్​ మహాసభకు స్వామి రామానంద తీర్థ అధ్యక్షత వహించారు. 
  • హైదరాబాద్​ స్టేట్​ కాంగ్రెస్​ మహాసభల్లో హైదరాబాద్​ సంస్థానం భారత యూనియన్​లో విలీనం కావాలనే తీర్మానాన్ని బూర్గుల రామకృష్ణారావు చదివారు.
  • 1947 ఆగస్టు 7న జాయిన్​ ఇండియా దినం పాటించాలని హైదరాబాద్​ స్టేట్​ కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది.
  • జాయిన్​ ఇండియా ఉద్యమంలో భాగంగా హైదరాబాద్​ స్టేట్​ కాంగ్రెస్​ ఏర్పాటు చేసిన సరిహద్దు శిబిరాలకు పి.వి.నర్సింహారావు, కె.వి.నర్సింగరావు, కోదాటి నారాయణరావు, టి.హయగ్రీవాచారి చేరుకున్నారు.
  • జవహర్​లాల్​ నెహ్రూ స్వామి రామానంద తీర్థకు అందజేసిన జాతీయ జెండాను 1947 ఆగస్టు 15న సుల్తాన్​ బజార్​లో మోతీలాల్​ మంత్రి ఎగురవేశారు. 
  • నిజాం సరిహద్దు అవతల ఉన్న యూనియన్​ ప్రాంతం నుంచి వచ్చే పాలు, పెరుగు, కూరగాయలు, పండ్లు, ఇతర రోజువారీ వినియోగానికి అవసరమయ్యే సామగ్రిపై నిజాం కరోడ్గిరి పన్ను వసూలు చేసేవారు.
  • అబ్కారీ ఆదాయానికి ముఖ్యమైన చెట్లు తాటి, ఈత, ఇప్పచెట్లు నిజాం కాలంలో ఈత, తాటి, ఇప్ప చెట్లను నరికిన వారికి శిక్షలతో వేధించేవారు.
  • నిజాం ప్రభుత్వానికి భూమి శిస్తు తర్వాత ముఖ్యమైన మరో ఆదాయం ఆబ్కారీ. 
  • నిజాం తాను స్వతంత్రుడనని 1947 ఆగస్టు 14న ఫర్మానా జారీ చేశాడు. 
  • ఇత్తేహాదుల్​ ముస్లిమీన్​ పార్టీని 1927లో స్థాపించారు. 
  • ఇత్తేహాదుల్​ ముస్లిమీన్​ పార్టీ అధ్యక్షుడు బహదూర్​ యార్​ జంగ్​.
  • ఒక సాంస్కృతిక సంస్థగా ఆవిర్భవించిన ఇత్తేహాదుల్​ ముస్లిమీన్ సంపూర్ణ ప్రజా వ్యతిరేక ఉద్యమంగా 1937 నుంచి మారింది. 
  • 1946లో ఇత్తేహాదుల్​ ముస్లిమీన్​ పార్టీ ఖాసిం రజ్వీ అధ్యక్షుడయ్యాడు.
  • 1930–40 ప్రాంతంలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వెట్టిచాకిరి, బేగారీ వంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా కామ్రేడ్స్​ అసోసియేషన్​ పోరాటం ప్రారంభించింది. 
  • నిజాం రాజుకు, భారత ప్రభుత్వానికి మధ్య 1947 నవంబర్​ 29న యధాతథ ఒప్పందం కుదిరింది. 
  • యధాతథ ఒప్పందం సంస్థాన ప్రజలను నిజాం దయాదాక్షిణ్యాలపై వదిలేసిందని ఫ్రీ ప్రెస్​ జర్నల్​ వ్యాఖ్యానించింది. 
  • హైదరాబాద్​ ప్రజలను ఇత్తేహాదుల్​ తోడేలు ముందు అప్పగించడమే కాకుండా​ సంస్థానంలో మ్యూనిచ్​ ఒప్పందం పునరావృతమైందని ఫ్రీ ప్రెస్​ జర్నల్​ పత్రిక పేర్కొన్నది. 
  • యధాతథ ఒప్పందంపై సంతకం చేయడమంటే హైదరాబాద్​లో కెఎం మున్షీ భారత ఏజెంట్​ జనరల్​గా నియమించింది.
  • రజాకార్ల చేతిలో ఇమ్రోజ్​ పత్రిక సంపాదకుడు షోయబుల్లాఖాన్​ హత్యకు గురయ్యాడు.
  • హైదరాబాద్​ ప్రాంతంపై సైనిక చర్యకు ఉపక్రమించాలని భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్​ 9న నిర్ణయానికి వచ్చింది.
  • హైదరాబాద్​ సంస్థానంపై సైనిక చర్యకు భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్​ 10న  హెచ్చరిక జారీ చేసింది.
  • హైదరాబాద్​ సంస్థానంపై భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్​ 13న సైనిక చర్య ప్రారంభించింది.
  • హైదరాబాద్​ సంస్థానంపై భారత సైనిక చర్యకు అప్పటి భారత గవర్నర్​ జనరల్​ సి. రాజగోపాలాచారి పోలీసు చర్య అని పేరు పెట్టారు.
  • హైదరాబాద్​ సంస్థానంపై భారత సైనిక చర్యను సైనిక పరిభాషలో ఆపరేషన్​ పోలో అని పేర్కొన్నారు.
  • హైదరాబాద్​ సంస్థానం భారతదేశంలో 1948 సెప్టెంబర్​ 18న విలీనమైంది.
  • హైదరాబాద్​ సంస్థానం భారతదేశంలో విలీనం కావడంతో సంస్థాన ప్రధాని మీర్​ లాయక్​ అలీ పాకిస్తాన్​ పారిపోయాడు.
  • సైన్యం నిర్బంధంలోకి తీసుకున్న ఖాసిం రజ్వీని 1959లో విడుదల చేశారు.