హైదరాబాద్లో గణపయ్య నిమజ్జనం.. భక్తుల కోసం 600 ప్రత్యేక బస్సులు

హైదరాబాద్లో గణపయ్య నిమజ్జనం.. భక్తుల కోసం 600 ప్రత్యేక బస్సులు

భక్తుల కోసం 600 బస్సులు నడపనున్నట్టు గ్రేటర్​ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ సి.వినోద్​కుమార్​ తెలిపారు. బషీర్​బాగ్ ​నుంచి కాచిగూడకు 20 బస్సులు, బషీర్​బాగ్ నుంచి రాంనగర్​కు 20, ఓల్డ్​ఎమ్మెల్యే క్వార్టర్స్​నుంచి దిల్ సుఖ్​నగర్(కొత్తపేట)కు 20, ఎల్​బీనగర్​కు 20, వనస్థలిపురానికి 20, మిథాని వరకు 20, లిబర్టీ టీటీడీ కల్యాణ మండపం నుంచి బోడుప్పల్​కు 20, ఇందిపార్క్ నుంచి మేడిపల్లి, సికింద్రాబాద్ స్టేషన్(20పి రూట్​)​, రిసాలాబజార్​, మల్కాజిగిరి/ఈసీఐఎల్, ఈసీఐఎల్ క్రాస్​రోడ్స్, సికింద్రాబాద్​ స్టేషన్, మల్కాజిగిరి/ నేరెడ్​మెట్, జామై ఉస్మానియాకు 160, లక్డీకాపూల్​నుంచి గచ్చిబౌలి/లింగంపల్లి 30, లక్డీకాపూల్/ఖైరతాబాద్ ​నుంచి పటాన్​చెరు, లక్డీకాపూల్/ఖైరతాబాద్​నుంచి కొండాపూర్/యూసుఫ్​గూడ, లక్డీకాపూల్ ​నుంచి రాజేంద్రనగర్(92 రూట్)కు 110, ఆల్ ​ఇండియా రేడియో నుంచి కోఠికి 20, ఖైరతాబాద్/లక్డీకాపూల్​నుంచి జీడిమెట్ల/గండిమైసమ్మ , జగద్గిరిగుట్ట, గాజులరామారం, సనత్​నగర్, కూకట్​పల్లి, బోరబండ, బాచుపల్లి/బౌరంపేట, లింగంపల్లి, కేపీహెచ్ బీ కాలనీ, పటాన్​చెరు, సికింద్రాబాద్​స్టేషన్(రూట్​నెం. 49)లలో 160 బస్సులను నడపనున్నారు.