ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ప్రేక్షకులూ రికార్డు కొట్టిన్రు..

ప్రపంచంలోనే అతి పెద్దదైన  అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌‌కు  హాజరైన ప్రేక్షకులు రికార్డు సాధించారు. 1.10 లక్షల కెపాసిటీ ఉన్న ఈ స్టేడియానికి ఆదివారం  లక్షా 4 వేల 859 మంది ప్రేక్షకులు హాజరైనట్టు అధికారికంగా ప్రకటించారు.  వైట్ బాల్ ( వన్డే, టీ20) ఫార్మాట్‌‌లో ఓ మ్యాచ్‌‌కు ఇదే రికార్డు అటెండెన్స్‌‌.1993లో ఈడెన్ గార్డెన్‌‌లో ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్‌‌కు లక్ష మంది హాజరైన రికార్డు ఇప్పుడు బ్రేక్‌‌ అయింది.