ఔటర్ రింగ్ రోడ్డుపై స్పీడ్ పెంచారు.. ఇక నుంచి 120పై వెళ్లొచ్చు

హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై గరిష్ట వేగ పరిమితిని గంటకు 100 కి.మీ. నుంచి గరిష్టంగా గంటకు 120 కి.మీలకు పెంచారు. ఈ విషయాన్ని తెలంగాణ ఎంఏ అండ్‌ యుడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ 2023 జూన్  27  మంగళవారం ప్రకటించారు.

మంత్రి కేటీఆర్ తో నిర్వహించిన సమీక్ష అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు.  వేగ పరిమితిని పెంచడానికి అవసరమైన అన్ని భద్రతా ప్రోటోకాల్‌లను ఉంచాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA)ని ఆదేశించారు. 

ఓఆర్‌ఆర్‌పై పెరుగుతున్న ప్రాణాంతక ప్రమాదాల దృష్ట్యా, సైబరాబాద్ పోలీసులు గతంలో ఓఆర్‌ఆర్‌పై వేగ పరిమితిని గంటకు 120 కిమీ నుండి 100 కిమీకి తగ్గిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.

ALSO READ:మోడీ కీలక వ్యాఖ్యలు... కేసీఆర్ బిడ్డ బాగుండాలంటే బీఆర్ఎస్కు ఓటేయండి

రెండు లేన్‌ల (మొదటి, రెండవ) వేగం కనిష్టంగా 80 కి.మీ మరియు గరిష్టంగా 100 కి.మీ మధ్య ఉండాలని, మూడవ మరియు నాల్గవ లేన్‌లు 40 కి.మీ వేగంతో ఉండాలని పోలీసులు నోటిఫై చేశారు. తాజాగా దానిని ఇప్పుడు మళ్లీ 120కి పెంచారు.