అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెంచాలి: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెంచాలి:  మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్, వెలుగు: అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెంచాలని గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్ లో రూ.10 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను శనివారం ఆమె పరిశీలించారు. మేయర్ మాట్లాడుతూ.. జనాల అవసరాలను గుర్తించి రోడ్లు, నాలా పనులకు నిధులను మంజూరు చేస్తున్నామన్నారు. ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు చేపట్టిన స్టీల్ బ్రిడ్జిని తొందరలోనే ఓపెన్ చేస్తామన్నారు. మేయర్ వెంట జోనల్ కమిషనర్ వెంకటేశ్, అధికా రులు ఉన్నారు..