
గుండె వ్యాధులకు సంబంధించి.. హార్ట్ స్ట్రోక్స్.గుండెపోటు.. ఇతర సంబంధించిన వ్యాధుల గురించి యూకే శాస్త్రవేత్తలు అధ్యనం చేసి నివేదిక వెల్లడించారు. ఆ నివేదిక ప్రకారం స్పీడ్‌గా వాకింగ్ చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుందని .. హార్ట్ రిస్క్ తగ్గుతందని వారు చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
స్పీడ్ వాకింగ్ హార్ట్ హెల్త్‌పై ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారుప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 10వేలఅడుగులు వేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హార్ట్ జనరల్‌లో యూకే శాస్త్రవేత్తల పరిశోధించిన వివరాల ప్రకాం.. ఎన్ని అడుగులు అనేది లెక్క కాదని.. ఎంత వేగంగా నడవాలి అనే విషయాన్ని చెబుతున్నారు. నడవవలసిన దానికంటే తక్కువ వేగంతో నడిస్తే... గుండె ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని హార్ట్ స్ట్రోక్.. గుండెపోటు వచ్చే అవకాశం ఉందని యూకే పరిశోధనల బృందం హెచ్చరిస్తుంది.
UK శాస్త్రవేత్తలు 42 వేల మందిపై అధ్యయనం చేశారు. వేగంగా నడవడం గుండె లయ అసాధారణతల ప్రమాదం తగ్గుతుందని ఆ అధ్యయనం ద్వారా తెలుస్తుంది. గంటకు 3 మైళ్ళు అంటే 4.8 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడిచిన వారికి 43 శాతం గుండె ప్రమాదాలను అరిక్టవచ్చు. అయితే కర్ణిక దడ కేసులు పెరుగుతాయని.. ఈ డిసీజ్ వల్ల ప్రతి సంవత్సరం 2 మిలియన్లకు పైగా చనిపోతున్నారని హార్ట్ జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ద్వారా తెలుస్తుంది.
Also Read:-అక్షయ తృతీయ రోజున ..ఈ వస్తువులు కొంటే బంగారంతో సమానమే..!
2024 అధ్యయనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 మిలియన్ల మందికి కర్ణిక దడ అనే డిసీజ్‌తో బాధపడుతున్నారు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం గుండెపోటు.. స్ట్రోక్స్ వచ్చి త్వరగా చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాని స్పీడ్ వాకింగ్ వల్ల ఈ వ్యాధిని అరికట్టవచ్చని యూకే శాస్త్రవేత్తల బృందం ప్రకటించింది. వాకింగ్ స్పీడ్.... హార్ట్ డిసీజ్ లతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో 40 నుంచి 69 సంవత్సరాల 50 వేల మందిపై వారి కార్యాచరణ డేటాను అధ్యయనం చేశారు. వాకింగ్ స్పీడ్ గురించి తెలుసుకొని గంటకు 4.8 నుంచి 6.4 కిలోమీటర్లు నడిచేవారికి ఎలాంటి ఇబ్బందులు లేవని నివేదించారు. సగటున 13 సంవత్సరాల ఫాలో-అప్ కాలంలో 9% మందికి అరిథ్మియాలు వచ్చాయి. పురుషుల కంటే మహిళలకు కర్ణిక దడ వచ్చే అవకాశం తక్కువగా ఉన్నా.... కర్ణిక దడ ఉన్న పురుషుల కంటే వారికి గుండెపోటు .. స్ట్రోక్‌లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
వాకింగ్ స్పీడ్ 3 నుంచి 4 mph మధ్య ఉన్నవారికి 35 శాతం హార్ట్ రిస్క్ ఉందని.. అంతకంటే స్లోగా వాకింగ్ చేసిన వారు హార్ట్ ఎక్కువ మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారని తెలిపారు. ఇక సరిపడ బరువున్న 60 సంవత్సరాల మహిళలు వాకింగ్ వలన ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతున్నారు.
స్పీడుగా వాకింగ్ చేసిన వారిలో గుండె ఆరోగ్యం మెరుగుపడటమేకాకుండా.. కొలెస్ట్రాల్.. షుగర్.. రక్తపోటు (బీపీ)కూడా తగ్గుతాయంటున్నారు .క్రమేణ వాకింగ్ స్పీడ్ పెంచితే గుండె సమస్యలను రాకుండా నిరోధించవచ్చని పరిశోథకుల అధ్యయనంలో తేలింది.