
హైదరాబాద్: అటవీ శాఖ క్లియరెన్సు రాకపోవడం వల్ల రాష్ట్రంలో 91 రోడ్లకు సంబంధించిన పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు ఫారెస్టు, రోడ్లు భవనాల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ అన్నారు. రహదారుల నిర్మాణంలో ఆలస్యం జరిగితే అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పారు. ఏడు రోడ్లకు అటవీశాఖ అనుమతించకపోవడంతో ఐదేండ్లుగా పెండింగ్లో ఉన్నాయని వివరించారు. వేగంగా అనుమతులు సాధించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలని అటవీశాఖ అధికారులకు మంత్రి కొండా సురేఖ సూచించారు.