జూబ్లీహీల్స్ చెక్ పోస్ట్ దగ్గర BMW కారు బీభత్సం

జూబ్లీహీల్స్ చెక్ పోస్ట్ దగ్గర BMW  కారు బీభత్సం

హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్  దగ్గర బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో  ట్రాఫిక్ పోలీస్ బూత్ దిమ్మెల్ని   ఢీకొట్టింది.  డివైడర్ దిమ్మెల్ని ఢీకొనడంతో కారు టైర్ పేలిపోయింది. కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో  ప్రాణ నష్టం తప్పింది. పోలీసులు వచ్చే లోపు  కారు దిగి డ్రైవర్  పరారయ్యిండు. కారు డ్రైవర్  మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.  

 మాలిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు తేల్చారు. కారుపై రెండు పెండింగ్ చలాన్లు ఉన్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఎంత మంది ఉన్నారనేది సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.

 హైదరాబాద్ లో ఈ మధ్య తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువగా బడాబాబులు, వాళ్ల పిల్లలే  రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. మద్యం తాగి కారు డ్రైవింగ్ చేయడం..యాక్సిడెంట్ చేయడం  కామన్ అయిపోయింది.