తమిళనాడులోని సేలంలో సెప్టెంబర్6 తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సేలం-ఈరోడ్ హైవేపై తెల్లవారుజామున 4 గంటల సమయంలో వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి ఆగి ఉన్న డీసీఎంని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఆ సమయంలో ఈంగూర్‌కు చెందిన ఎనిమిది మంది సభ్యులు వ్యాన్‌లో పెరుంతురై వైపు వెళుతున్నారు. మృతులు సెల్వరాజ్, మంజుల, ఆరుముగం, పళనిసామి, పాపతి, ఏడాది వయసున్న చిన్నారిగా గుర్తించారు.
ALSO READ : జలదృశ్యం ..పరవళ్లు తొక్కుతున్న ఎగువ మానేరు డ్యామ్ (వీడియో)
ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ విజువల్స్ రికార్డు అయ్యాయి.