
- కాచిగూడ పరిధిలో ఘటన
బషీర్బాగ్, వెలుగు: కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ బైక్ పై వెళ్తున్న సాఫ్ట్వేర్ఇంజినీర్ ను ఢీకొట్టడంతో చనిపోయాడు. జియాగూడ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉండే దుర్గేష్ కొడుకు తుకారాం(28) సాఫ్ట్వేర్ఇంజినీర్. ఆదివారం మధ్యాహ్నం బైక్ పై కాచిగూడ కబేలా నుంచి గోల్నాక చౌరస్తా వైపు వెళ్తున్నాడు. అంబికా వైన్స్ సమీపంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో తుకారాం ట్యాంకర్ వెనుక చక్రాల కిందపడి తీవ్రంగా గాయడపడ్డాడు. స్థానికులు 108లో దవాఖానకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. పోలీసులు వాటర్ ట్యాంకర్ డ్రైవర్ మహమ్మద్ అబ్దుల్ నహీం(49)ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అడ్మిన్ ఎస్సై డి.సుభాష్తెలిపారు.
బాల్ కోసం వెళ్తుండగా బస్సు కింద పడి బాలుడు మేడిపల్లి: క్రికెట్బాల్ కొనుక్కోవడానికి బైక్పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ బాలుడు చనిపోయాడు. ఘట్ కేసర్ మండలం కాచవానిసింగారం కాంతిదీప్ కాలనీలో ఉండే గోపి కొడుకు అక్షిత్(13). స్థానిక స్కూల్ఏడో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం పెదనాన్న కొడుకు అభిలాష్ తో కలిసి స్కూటీపై క్రికెట్బాల్ కొనేందుకు బయలుదేరాడు.
పర్వతాపూర్ వైపు వెళ్తుండగా పోచమ్మగుడి సమీపంలో దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు వీరి స్కూటీని ఢీకొట్టింది. ఒక్కసారిగా ఇద్దరూ కింద పడిపోయారు. వెనుకాల కూర్చున్న అక్షిత్ బస్సు ముందు టైర్ కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.