వ్యవసాయ శాఖలో బదిలీల ప్రక్రియ స్పీడప్

  • 20వ తేదీలోగా పూర్తయ్యే అవకాశం
  • వెయ్యి మందికిపైగా బదిలీకి  చేసే చాన్స్
  • ఇప్పటికే ఆప్షన్లు పెట్టుకుంటున్న ఉద్యోగులు

హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్ డిపార్ట్​మెంట్​లో ట్రాన్స్​ఫర్ల ప్రక్రియను ప్రభుత్వం స్పీడప్ చేసింది. ఒకే చోట నాలుగేండ్లకుపైగా పని చేస్తున్న అధికారులను ఈ నెల 20వ తేదీలోగా బదిలీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖలో నాలుగు వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో వెయ్యి మంది ట్రాన్స్​ఫర్ పరిధిలో ఉన్నట్టు తెలుస్తున్నది. కేడర్ స్ట్రెంథ్​లో 40 శాతం మేరకు బదిలీ చేసే పరిస్థితులు ఉండగా.. 25 శాతం మంది మాత్రమే నాలుగేండ్లు ఒకే ప్లేస్​లో జాబ్ చేస్తున్నట్లు గుర్తించారు. 

తాజాగా ప్రభుత్వం జీవో నంబర్ 80 ద్వారా ట్రాన్స్​ఫర్ల ప్రక్రియ చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖలో వెయ్యి మందికి బదిలీ తప్పదని డిపార్ట్​మెంట్ వర్గాలు అంటున్నాయి. ట్రాన్స్​ఫర్ ఆప్షన్ల కోసం ఇప్పటికే అగ్రికల్చర్ వెబ్​సైట్ పోర్టల్​లో స్పెషల్ అప్లికేషన్​ను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు తమకు అనుకూలమైన ప్రదేశాల్లో పని చేసేందుకు ఆప్షన్లు పెట్టుకుంటున్నారు. ఆప్షన్ల ప్రక్రి య పూర్తయ్యాక ఉద్యోగులకు కౌన్సెలింగ్ చేపట్టే అవ కాశం ఉన్నట్టు తెలుస్తున్నది. వ్యవసాయ శాఖలో 8 రకాల సీనియార్టీలను పరిగణనలోకి తీసుకోనున్నారు. 

డిపార్ట్​మెంట్​లో మొత్తం 36 రకాల కేడర్లు ఉండగా.. వాటిని కలిపి జోన్ వారీగా బదిలీల ప్రక్రి య చేపట్టనున్నారు. హైదరాబాద్ పరిధిలో ఒకే చోట నాలుగేండ్లు పని చేసిన అధికారులకు బదిలీ తప్పదని అగ్రికల్చర్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఏ స్థాయి అధికారి అయినా.. నాలుగేండ్లు ఎక్కడ పని చేసినా.. డిప్యూటేషన్​లో మరో సంస్థలో ఉన్నా.. బదిలీ చేయనున్నారు. పలువురు ఉన్నతాధికారులు కూడా ట్రాన్స్​ఫర్ అవుతారని సమాచారం.