స్పెన్సర్స్‌‌ చేతిలో నేచర్స్‌‌ బాస్కెట్‌‌

స్పెన్సర్స్‌‌ చేతిలో నేచర్స్‌‌ బాస్కెట్‌‌

కోల్‌‌కతా : నేచర్స్‌‌ బాస్కెట్‌‌లో నూరు శాతం వాటాలను గోద్రెజ్‌‌ ఇండస్ట్రీస్‌‌ నుంచి రూ. 300 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు రిటైల్‌‌ రంగంలోని స్పెన్సర్స్‌‌ రిటైల్‌‌ లిమిటెడ్‌‌ వెల్లడించింది. రూ. 300 కోట్లను నగదు రూపంలోనే చెల్లించనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో గ్రోసరీ చెయిన్‌‌ను నేచర్స్‌‌ బాస్కెట్‌‌ నిర్వహిస్తోంది. గోద్రెజ్‌‌ ఇండస్ట్రీస్‌‌ లిమిటెడ్‌‌కు నేచర్స్‌‌ బాస్కెట్‌‌ నూరు శాతం సబ్సిడియరీ. ఆర్‌‌పీ సంజీవ్‌‌ గోయెంకా గ్రూప్‌‌లోని స్పెన్సర్స్‌‌ రిటైల్‌‌ లిమిటెడ్‌‌కు ఇండియాలోని 39 సిటీలలో 156   స్టోర్స్‌‌ ఉన్నాయి.

మార్చి 2019తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ. 2.39 కోట్ల నికరలాభం ప్రకటించింది. అంతకు ముందు ఏడాదిలో స్పెన్సర్స్‌‌ రిటైల్‌‌కు రూ. 14.12 కోట్ల నష్టం వచ్చింది. నేచర్స్‌‌బాస్కెట్‌‌తో దేశమంతటా తమ కార్యకలాపాల విస్తరణ సాధ్యపడుతుందని, ముంబై, పుణె, బెంగళూరులలో ఆ కంపెనీకి 36 స్టోర్లున్నాయని స్పెన్సర్స్‌‌ రిటైల్‌‌ హెడ్‌‌ షాష్వత్​ గోయెంకా తెలిపారు. ఈ డీల్‌‌కు రెండు కంపెనీల వాటాదారుల ఆమోదం లభించాల్సి ఉంటుంది. స్పెన్సర్స్‌‌ రిటైల్ అమ్మకాలు 2018–19లో రెట్టింపై రూ. 2,215 కోట్లకు చేరాయి.