ప్రధాని మోదీ ఎస్​పీజీ డైరెక్టర్​ మృతి

స్పెషల్​ ప్రొటెక్షన్​ గ్రూప్ (ఎస్​పీజీ)​చీఫ్​అరుణ్ కుమార్​సిన్హా(61) సెప్టెంబర్​ 6న మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ భద్రతా దళమైన ఎస్ పీజీకి సిన్హా డైరెక్టర్​గా ఉన్నారు. 

క్యాన్సర్​తో బాధపడుతున్న ఆయన హరియాణా రాష్ట్రం గురుగ్రామ్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందారు. 2016నుంచి ఆయన ఎస్​పీజీలో పని చేస్తున్నారు. 

Also Read : ఆగి ఉన్న డీసీఎంని ఢీ కొన్న వ్యాన్.. ఆరుగురు మృతి

పీఎం నరేంద్ర మోదీతోపాటు చాలా మంది మాజీ ప్రధానుల ప్రొటెక్షన్ లో ఆయన పని చేశారు. సిన్హా 1987 బ్యాచ్​ కేరళ కేడర్​ ఐపీఎస్​ అధికారు. ఇటీవలే ఆయన సర్వీసును పొడగించినట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ లోపే ఆయన మృతి చెందడం విషాదాన్ని నింపింది.