హైదరాబాద్, వెలుగు: ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ మేడ్చల్ (హైదరాబాద్) లోని ది స్ఫూర్తి ఫౌండేషన్‌కు స్కూల్ బస్సును దానం చేసింది. ఎల్‌ఐసీ జోనల్ మేనే జర్ పునీత్ కుమార్ స్ఫూర్తి ఫౌండేషన్ డైరెక్టర్ తేజస్వినికి బస్సు తాళాలను అందజేశారు.
ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్‌ను 2006 లో ఎల్‌ఐసీ ఏర్పాటు చేసిందని, దేశంలో ఎడ్యుకేషన్, హెల్త్‌ను ప్రమోట్ చేస్తోందని పునీత్ కుమార్ అన్నారు. హాస్పిటల్స్ నిర్మాణానికి, స్కూల్ బిల్డింగ్‌లకు, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్, ఓల్డ్ ఏజ్ హోమ్ ఇలా చాలా ప్రాజెక్ట్‌లకు సాయం చేసిందని పేర్కొన్నారు. చదువు, ఆహారం, దుస్తులను పేదలకు ఉచితంగా స్ఫూర్తి ఫౌండేషన్ అందిస్తోందని మెచ్చుకున్నారు.