కాశీబుగ్గ, వెలుగు : వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో స్పైస్ టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మార్కెట్ సెక్రటరీ పోలెపాక నిర్మల చెప్పారు. బుధవారం ఆమె మాట్లాడుతూ మిర్చిలో తేమ, అప్లాటాక్సిన్ శిలీంద్రం, మిర్చి రంగును గుర్తించేందుకు నాబార్డ్, స్పైస్ బోర్డు ఆధ్వర్యంలో రూ. 33 లక్షలతో టెస్టింగ్ మిషన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ల్యాబ్‌లో మిర్చి క్వాలిటీని గుర్తించి రైతులకు మంచి ధర ఇవ్వడంతో పాటు, వ్యాపారులకు క్వాలిటీ మిచ్చి ఎగుమతి చేసే అవకాశం కలుగుతుందన్నారు. ఆమె వెంట నాబార్డ్ ఇంచార్జ్ చంద్రశేఖర్ స్పైస్ బోర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ విజ్ఞేష్న, ఛాంబర్ ప్రెసిండెంట్ బొమ్మినేని రవీందర్‌రెడ్డి ఉన్నారు.