రామా ఏంటీ అన్యాయం : అయోధ్యకు నేరుగా విమానాలు బంద్ చేశారా..?

రామా ఏంటీ అన్యాయం : అయోధ్యకు నేరుగా విమానాలు బంద్ చేశారా..?

స్పైస్‌జెట్ సంస్థ కీలక ప్రకటన చేసింది.  హైదరాబాద్ నుంచి అయోధ్యకు గతంలో ప్రారంభించిన  విమాన సేవలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. తగిన డిమాండ్ లేకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది.  2024 జూన్ 1నుంచే ఈ సేవలను నిలిపి వేసినట్లుగా స్పష్టం చేసింది.  అయితే చెన్నై నుంచి అయోధ్యకు విమాన సేవలను కొనసాగిస్తున్నట్లుగా వెల్లడించింది. కాగా ఏప్రిల్ 02న  హైదరాబాద్- నుంచి అయోధ్యకు  స్పైస్‌జెట్  డైరెక్ట్ గా విమాన సేవలను ప్రారంభించింది. వారానికి మూడుసార్లు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చి మే 30 వరకు నడిపించింది.  

SG 611 విమానం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుండి ఉదయం 10:45 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 12:45 గంటలకు అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తిరుగు ప్రయాణంలో SG 616, మధ్యాహ్నం 1:25 గంటలకు అయోధ్య నుండి బయలుదేరి, 3:25 గంటలకు హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యేది. ఇప్పుడు ఈ సేవలు నిలిచిపోవడంతో  హైదరాబాద్  నుంచి అయోధ్యకు ప్రయాణించాలనుకునే భక్తులకు ఓ సవాలనే చెప్పాలి.