స్పైస్‌‌‌‌‌‌‌‌ జెట్‌‌‌‌‌‌‌‌లో ఫ్లాష్‌‌‌‌‌‌‌‌ మాబ్‌‌‌‌‌‌‌‌

స్పైస్‌‌‌‌‌‌‌‌ జెట్‌‌‌‌‌‌‌‌లో ఫ్లాష్‌‌‌‌‌‌‌‌ మాబ్‌‌‌‌‌‌‌‌
  •  హోలీ సందర్భంగా విమానంలో డ్యాన్స్‌‌‌‌‌‌‌‌తో అలరించిన సిబ్బంది

న్యూఢిల్లీ: హోలీ పండుగ సందర్భంగా స్పైస్‌‌‌‌‌‌‌‌ జెట్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది తమ డ్యాన్స్‌‌‌‌‌‌‌‌తో ప్రయాణికులను అలరించారు. ఢిల్లీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్ట్‌‌‌‌‌‌‌‌లో టేకాఫ్‌‌‌‌‌‌‌‌కు సిద్ధంగా ఉన్న ఓ స్పైస్‌‌‌‌‌‌‌‌ జెట్‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌‌‌‌‌లోని సిబ్బంది సంప్రదాయ దుస్తులు ధరించి, హోలీ సాంగ్‌‌‌‌‌‌‌‌ ‘బలం పిచ్‌‌‌‌‌‌‌‌కారి’ పాటకు ఫ్లాష్‌‌‌‌‌‌‌‌ మాబ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. పాటలోని మ్యూజిక్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్లు చూడచక్కని స్టెప్పులు వేశారు. దీంతో ప్రయాణికులు చప్పట్లు కొడుతూ.. తమ ఫోన్లకు పని చెప్పారు. విమాన సిబ్బంది డ్యాన్స్‌‌‌‌‌‌‌‌ను రికార్డు చేసి, సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు.