- ఖర్చులు తగ్గించుకునేందుకు స్పైస్ జెట్ మూన్నెళ్ల సెలవులు
- 80 మంది పైలట్లను ఇంటికి పంపిన సంస్థ
ముంబై: ఖర్చులు తగ్గించుకునేందుకు స్పైస్‌జెట్.. తన బోయింగ్, బాంబార్డియర్ క్యూ400కి చెందిన 80 మంది పైలట్లకు 3 నెలల పాటు సెలవులిచ్చింది. నాలుగేండ్లుగా సంస్థ నష్టాల్లో ఉందని, పైలట్లకు శాలరీ ఇవ్వలేమని ప్రకటించింది. బుధవారం నుంచే ఈ లీవ్స్ అమలవుతాయని చెప్పింది. విమాన సర్వీస్‌లు తగ్గిపోయాయని, సంస్థలో ఎక్స్ట్రా పైలట్లు ఉన్నారని, వారిని లీవ్‌పై పంపినట్టు చెప్పింది. ఖర్చులు తగ్గించుకునేందుకే ఇలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. ఏ ఉద్యోగిని తొలగించబోమని, పూర్తిస్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభమైన తర్వాత వీరంతా డ్యూటీలోకి వస్తారని పేర్కొంది. సెలవుల్లో ఉన్న పైలెట్లకు జీతం మినహా ఇతర అన్ని బెనిఫిట్స్ అందుతాయని స్పష్టం చేసింది.
భారీ నష్టాల్లో స్పైస్‌జెట్
జూన్ త్రైమాసికం నాటికి స్పైస్‌జెట్ రూ.789 కోట్ల నష్టాల్లో ఉంది. సాంకేతిక లోపాల కారణంగా డీజీసీఏ ఆదేశాలతో స్పైస్ జెట్ తనకున్న మొత్తం 90 విమానాల్లో 50 ఫ్లైట్లనే నడుపుతోంది. అక్టోబర్ 29, 2022 దాకా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని డీజీసీఏ తెలిపింది.