దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకీ భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 63 వేలకు చేరువైంది. రెండు వేల మందికి పైగా ఈ వైరస్ కు బలయ్యారు. గడిచిన 24 గంటల్లో 3277 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా మహమ్మారి బారినపడి ఒక్క రోజులోనే కొత్తగా 127 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా పరస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం 8 గంటలకు బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన 3277 కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 62,939కి చేరింది. గడిచిన 24 గంటల్లో మరణించిన 127 మందితో కలపి మొత్తంగా 2019 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 19358 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 41,472 మంది చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో 20 వేలు దాటిన కేసులు
దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 20228 మంది కరోనా బారినపడ్డారు. అందులో 779 మంది మరణించగా.. 3800 మంది డిశ్చార్జ్ అయ్యారు. గుజరాత్ లో 7796, ఢిల్లీలో 6542, తమిళనాడులో 6535 మందికి వైరస్ సోకింది. రాజస్థాన్ లో 3708, మధ్యప్రదేశ్ లో 3614, యూపీలో 3373 కేసులు నమోదయ్యాయి. ఏపీలో 1930, పశ్చిమ బెంగాల్ 1786, పంజాబ్ లో 1762, తెలంగాణలో 1163, జమ్ము కశ్మీర్ లో 836, కర్ణాటకలో 794 మందికి కరోనా వైరస్ సోకింది.
4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఆల్ క్లియర్..
దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కరోనా బారినపడిన వారంతా పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్ లలో పేషెంట్లంతా కోలుకోగా.. తాజాగా మిజోరం రాష్ట్రంలో కరోనా బారినపడిన ఒకే ఒక్క పేషెంట్ జబ్బునయమై డిశ్చార్జ్ అయ్యారు. కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ లోనూ మొత్తం 33 మంది పేషెంట్లు కోలుకుని ఇంటికి చేరారు. అన్ని కేసులు క్లియర్ అయిన ఈ ఐదు చోట్ల ఒక్క మరణం కూడా లేకపోవడం విశేషం.
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం పేషెంట్లు డిశ్చార్జ్
గోవా 7 7
మణిపూర్ 2 2
అరుణాచల్ ప్రదేశ్ 1 1
మిజోరం 1 1
అండమాన్ నికోబార్ 33 33
Spike of 3277 #COVID19 cases & 127 deaths in the last 24 hours. Total cases in the country now at 62939, including 41472 active cases, 19358 cured/discharged/migrated and 2109 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/XoGLfUF3Jr
— ANI (@ANI) May 10, 2020