- ఐదు వికెట్లతో శోభన ఆశ మ్యాజిక్
- యూపీపై ఆర్‌సీబీ గెలుపు
బెంగళూరు: స్పిన్నర్ శోభన ఆశ (5/22) ఐదు వికెట్లతో మ్యాజిక్ చేయడంతో డబ్ల్యూపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చిన్న టార్గెట్‌ను కాపాడుకుంటూ బోణీ చేసింది. సొంతగడ్డపై శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 2 రన్స్ తేడాతో యూపీ వారియర్స్‌ను ఓడించింది. తొలుత ఆర్‌సీబీ 20 ఓవర్లలో 157/6 స్కోరు చేసింది. యంగ్‌స్టర్ రిచా ఘోశ్ (37 బాల్స్‌లో 12 ఫోర్లతో 62), తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (44 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 53) ఫిఫ్టీలతో రాణించారు.
రాజేశ్వరి రెండు వికెట్లు తీసింది. ఓపెనర్ సోఫీ డివైన్ (1), కెప్టెన్ స్మృతి మంధాన (13), ఎలైస్ పెర్రీ (8) నిరాశపరచడంతో ఆర్‌సీబీ 7.5 ఓవర్లకు 54/3తో కష్టాల్లో పడింది. కానీ, మేఘన, రిచా దూకుడుగా ఆడుతూ నాలుగో వికెట్‌కు 71 రన్స్ జోడించి జట్టుకు మంచి స్కోరు అందించారు. ఛేజింగ్‌లో యూపీ ఓవర్లన్నీ ఆడి 155/7 స్కోరు చేసి ఓడింది. కెప్టెన్ అలీసా హీలీ (1) ఫెయిలైనా గ్రేస్ హారిస్ (38), తాలియా మెక్‌గ్రాత్ (22), శ్వేత (31), వ్రిందా (18) జట్టును రేసులో నిలిపారు. కానీ, 17వ ఓవర్లో హారిస్, శ్వేతతో పాటు నవగిరె (1)ను ఔట్ చేసిన ఆశ యూపీ ఆశలపై నీళ్లు కుమ్మరించింది. ఆమెకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.