వైభవం.. ఆధ్యాత్మిక సమ్మేళనం

వైభవం.. ఆధ్యాత్మిక సమ్మేళనం

హనుమకొండ, వెలుగు: మహాశివరాత్రి సందర్భంగా హనుమకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్​లో ఇండస్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం' వైభవంగా సాగింది. ఫౌండేషన్​ చైర్మన్​ ఏనుగుల రాకేశ్​ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం జరగగా, బీఆర్​ఎస్​ నేతలు సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్​రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్​ రంగరాజన్, ప్రణవానంద దాస్​ ప్రవచనాలు, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రసంగాలు అలరించాయి.

అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న కళాకారులకు ఇండస్​ఫౌండేషన్​ ఆధ్వర్యంలో 'కాకతీయ పురస్కారం' అందజేశారు. కళలు, సాహిత్యం రంగంలో పల్లె రాములు, ఆధ్యాత్మికత, కోటగుళ్ల పరిరక్షణలో నాగపురి శ్రీనివాస్​ గౌడ్, పోశాల శ్రీనివాస్(యోగా), మల్లికాంబ మనోవికాస కేంద్రం రామలీల(సామాజిక సేవ),  సిరిపురం మహేశ్​(క్రీడలు), మూడు విశ్వామిత్ర(పర్యావరణం), రంజిత్(పర్యావరణం), పడమటి అన్వితా రెడ్డి(మహిళా సాధికారత, సాహసం), కన్నె రాజు(సామాజిక సేవా క్రీడలు), ఎంఎన్​ఆర్​ గుప్తా(సామాజిక సేవా, ఆర్కిటెక్ట్) తదితరులు కాకతీయ పురస్కారాలు అందుకున్నారు. అనంతరం హిమాన్షి కాట్రగడ్డ నృత్యం, ఫోక్​ సింగర్స్​ ​మాట్ల తిరుపతి, శిరీష, భిక్షమమ్మ, అనితా యాదవ్​ తదితరుల ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​ రావు, సత్యవతి రాథోడ్​, మాజీ ఎమ్మెల్యేలు ఒడితల సతీశ్​ కుమార్, నన్నపనేని నరేందర్, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.