ఆధ్యాత్మిక గురువు కేశవానంద భారతి శ్రీపాదగల్వారు (79) ఆదివారం కన్నుమూశారు. ఆయన కేరళలోని కాసర్‌గడ్ జిల్లాలోని ఎడనీర్ మఠంలో ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆయన చనిపోయినట్లు సమాచారం. ఆయన గుండె మరియు శ్వాస సంబంధ సమస్యలతో కొన్ని రోజుల క్రితం మంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయనను ఎడనీర్ మఠానికి తరలించారు. అక్కడ ఈ రోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.
కేశవానంద భారతి కేరళ భూసంస్కరణ చట్టాన్ని సవాలు చేస్తూ 1973లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కేశవానంద భారతి ఆశ్రమానికి చెందిన మఠాన్ని కేరళ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ ఆయన ఈ కేసు వేశారు. ఆ కేసు కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా ప్రసిద్ధిచెందింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు చరిత్రలో సుదీర్ఘంగా 68 రోజులపాటు విచారణ జరిగింది. ఈ కేసును 13 మంది న్యాయమూర్తులతో కూడిన బెంచ్ విచారణ జరిపింది. ఈ కేసు విచారణ 1972 అక్టోబర్ 31న ప్రారంభమై మార్చి 23, 1973న ముగిసింది.
For More News..