
న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక గురువులు హాజరై, మోదీకి ఆశీర్వచనాలు అందజేశారు. జగద్గురు రాంభద్రాచార్య, శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి, ఇతర ఆధ్యాత్మిక గురువులు కార్యక్రమంలో పాల్గొన్నారు.