అదానీ ఇష్యూ పార్లమెంటు ఉభయ సభలను కుదిపేస్తున్న వేళ.. అదానీ వ్యవహారంపై విచారణ జరపాలని ప్రతిపక్షాలు ఒక్కతాటిపై నిలిచిన సందర్భంలో.. ఇదే అంశంపై ఆధ్యాత్మిక గురువు సద్గురు కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడూ స్పిరిచువల్ అంశాలపైనే ఫోకస్ చేసే సద్గురు అదానీ ఇష్యూపై మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశం. శీతాకాల సమావేశాలు సజావుగా జరగకపోవడంపై.. అదే విధంగా అదానీ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనలుపై సద్గురు స్పందించారు.
దేశానికి సంపద సృష్టిస్తున్న వారిని, ఉపాధి అందిస్తున్న వారిని రాజకీయాల్లోకి లాగొద్దని సద్గురు అన్నారు. భారత వ్యాపారం ప్రపంచ స్థాయిలో దూసుకుపోవాలంటే అదానీ లాంటి వారిని రాజకీయాలకు అతీతంగా చూడాలని అన్నారు. అదానీ అంశంపై పార్లమెంటు సజావుగా జరగకపోవడం బాధాకరమైన విషయమని అన్నారు. ఏదైనా ఉంటే చట్టప్రకారం వెళ్లాలని, రాజకీయంగా టార్గెట్ కావడం భారత్ వంటి ప్రజాస్వామ్య దేశానికి మంచిది కాదని సూచించారు. వ్యాపారులను రాజకీయ చట్రంలోకి లాగక పోవడమే దేశం భవ్య భారత్ గా ఎదగడానికి తోడ్పడే అంశం అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read : అతుల్ సుభాష్ పరిస్థితి మరొకరికి రాకూడదని
నవంబర్ 25 నుండి పార్లమెంటు ప్రారంభమవ్వగా.. ఈ సెషన్ మొత్తం ఆందోళనల మధ్యనే ముగిసేలా ఉంది. ప్రతిపక్షాల డిమాండ్ కు ప్రభుత్వం ఎక్కడా తలొగ్గేలా కనిపించడం లేదు. డిసెంబర్ 20న పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి. అయితే ప్రతిపక్షాలు అదానీ వ్యవహారం మీద విచారణ చేపట్టాలని పట్టుబడుతున్న వేళ సద్గురు కామెంట్స్ పై విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.