ఆధ్యాత్మికం: కర్మాచరణ... జ్ఞానం.....అంటే ఏమిటి? శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా ?

ఆధ్యాత్మికం: కర్మాచరణ... జ్ఞానం.....అంటే ఏమిటి? శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా ?

ప్రతి మనిషి జీవితంలో కష్ట..సుఖాలు లాభ నష్టాలు ఉంటాయి.  జీవితం అంటేనే అనుభవాలు పాఠాలు నేర్పుతాయని పెద్దలు అంటారు.  ఈ అనుభవాలన్నీ .. కలా..మాయా... నిజమా  అని ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు వస్తుంటాయి.   ఇవన్నీ కొన్ని ఆధ్యాత్మికపరంగా సంశయాలను ( అనుమాలను) కలుగజేస్తే ... మరికొన్ని భౌతికపరంగా ఏర్పడుతాయి. ఏది ఎలా ఉన్నా అలాంటి వాటిని పక్కనపెట్టి ముందుకు వెళ్లాలికదా..  దానినే ఙ్ఞానం అంటారు. కాని సంశయం  (అనుమానం) మానవుడిని చేసే పనిని అంటే కర్తవ్యాన్ని వెనక్కు లాగుతుంది.  అది చేస్తే ఏమవుతుంది.. ఇది చేస్తే ఏమవుతుంది.. ఇలా అనేక ప్రశ్నలు వస్తుంటాయి. 

సంశయం అంటే ఇదా.. అదా.. ఇలానా.. అలానా.. ఇప్పుడా.. అప్పుడా.. ఇలా ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి రాలేము.   అది ఇటు అటు రెండు వైపులా మానవులని లాగుతుంది.  అలాంటి పరిస్థితిని  సంశయం అని అంటారు.  అలా కలిగినప్పుడు ఏదో ఒకటి చేయడము  అనేది ఎప్పుడూ జరగదు. ఏదైనా ఒక నిర్ణయం ఏర్పడితేనే మంచైనా, చెడైనా చేయగలుగుతాడు. సంశయంలో ఉండి, ఊగిసలాడుతూన్నంత వరకు  ఏమీ చేయలేడు.

అర్జునుడికి ...   శ్రీకృష్ణుడు ఎంతో ఉపదేశం చేసాడు.  నాయినా నువ్వు తగినటువంటి భాద్యతని నెరవేర్చు కర్మని ఆచరించాలి.  ఆ కర్మ ఒకవేళ తప్పుగ కనిపించిన బెంగ పడవద్దు , దానిని సవ్యంగా చేసుకుంటూ వెళ్ళు...  అలా చేసినట్టైతే అది మంచి పనే అవుతుంది.   నీకు అది ఈశ్వర ఆరాధన తో సమానమవుతుంది. వైద్యుడు శరీరాన్ని కోస్తాడు కాని దాన్ని మనం హింస అని అనటంలేదు కదా.. అది కోయకపోతే తప్పు వాడికి అది అవసరం. రోగికి అది అవసరం వైద్యుడు దాన్ని చేయాలి.   అందుచేత చేసే పనిలో తప్పు ఉన్నా ఫరవాలేదు ఐతే చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నామో .. అది లోకానికి.. ప్రజలకు.. తనకు ఎంత మంచి.. చెడా అనే ఒక నిర్ణయానికి వచ్చి దానిని చేయాలా వద్దా అనేది తెలుసుకొమ్మని చెప్పాడు.

ALSO READ | Spiritual: వేదాల్లో విద్య గురించి ఏముంది.. సంతోషంగా .. హాయిగా ఉండాలంటే డబ్బు ఎలా సంపాదించాలి..

ఎలాంటి పరిస్థితుల్లో చేయాలో చక్కగ వివరించాడు.. శ్రీకృష్ణుడు..   జ్ఞానం. ఆ జ్ఞానం ఎట్లా ఉండాలి.. ఆ పని చేయడం  కేవలం  స్వార్ధం కోసమా.. ఎంతమందికి ఉపయోగపడుతుంది అనే విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.  స్వలాభం కోసం కాదు.  లోకాన్ని .. ప్రజలను..దృష్టిలో పెట్టుకొని ఎంతమంది శ్రేయస్సు కలుగుతుంది.   ఇది ప్రపంచ వ్యవస్థకి  ఎంతమేరకు అవసరపడుతుంది. అవన్నీ ఆలోచించాలి.  దానినే ఙ్ఞానం అంటారు.  ఙ్ఞానం ప్రకారం చేసి తీరాలి.  ప్రతి పనికి  జ్ఞానం చాలా ప్రధానం సుమా.. అని  శ్రీకృష్ణుడు .. అర్జునిడికి చెప్పారు.

మనం కూడా  సమాజానికి .. మనకి కూడా మంచి చేసుకోవాలి అనుకుంటున్న వ్యక్తులం కనక మంచి గురించి మనకి ఒక నిర్ణయం  ఏర్పడాలి. ఐతే మన అనుభవం , మనకుండేటటు వంటి జీవితం చాలా తక్కువ కనక అనుభవించినటు వంటి పెద్దల యొక్క ఉపదేశం మన ఆసరాగా తీస్కున్నట్లయితే త్వరగా ముందుకి సాగగలుగుతాం. అనుభవించి నటువంటి వ్యక్తులు ఎవరు.. ఏం చెప్పాలి వాళ్ళు మనకి, ఎట్లా చెప్తారు.

లోకంలో ఉండేటటు వంటి వ్యక్తులు ఒక్కొక్కరూ ఒక్కొక్క మార్గం మనకి చూపిస్తుంటారు, నలుగురిని ఆశ్రయించి మనం వినేటప్పటికి అస్సలు ఏది తగునో ఏది తగదో నిర్ణయించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతుంటాము. అందుకే భగవంతుడు తానే నేరుగ భాద్యత తీసుకొని, ఏది తగునో దాన్ని నిర్ణయించి చెప్పడానికి, ఏది తగదో దాన్ని మానమని చెప్పడానికి ఈ లోకం లోకి దిగివచ్చాడు శ్రీకృష్ణుడై అవతరించాడు.