హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఉన్న డైన్ ఇన్ చైనా రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హోటల్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కుళ్లిపోయిన మాంసం నిల్వ ఉంచినట్లు గుర్తించామని..గడువు ముగిసిన ప్యాకింగ్ అహర పదార్థాలు గుర్తించినట్లు తెలిపారు అధికారులు. గుర్తించిన ఆహార పదార్థాలను పరీక్షల కోసం ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు అధికారులు.
హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వరుసగా బయటపడుతున్న హోటళ్ల నిర్వాకం చూసి ఆందోళన చెందుతున్నారు ఫుడ్ లవర్స్. నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.
ALSO READ | హైదరాబాద్ జీడిమెట్లలో అగ్ని ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్..