హైదరాబాద్:పత్తి పంటలను గులాబీ పురుగుల నుంచి రక్షించడానికి మనదేశానికి చెందిన టెక్స్ టైల్ కంపెనీ స్పోర్ట్స్కింగ్ ఇండియా, ఏటీజీసీ బయోటెక్‌తో చేతులు కలిపింది. పంజాబ్, హర్యానాలో 'శాన్–-వర్ధన్' (కాటన్ యు కెన్ ట్రస్ట్)ను ప్రారంభించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఏటీజీసీ బయోటెక్ క్రెమిట్ (కంట్రోల్డ్ రిలీజ్డ్ ఎన్హాన్స్డ్ మేటింగ్ ఇంట్రాప్షన్ టెక్నాలజీ) అనే టెక్నాలజీని వాడుతోంది. ఇది సంప్రదాయ క్రిమిసంహారక మందులకు ప్రత్యామ్నాయమని, పురుగుమందుల వాడకాన్ని తగ్గించడంలో తోడ్పడుతుందని ప్రకటించింది.