కేసీఆర్ హయాంలో క్రీడలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని అన్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా వ్యవహారాల సలహాదారు జితేందర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి స్వతహాగా క్రీడా ప్రేమికుడు, క్రీడాకారుడని చెప్పారు. పిల్లలు చెడు సావాసాలకు అలవాటు కాకుండా ఉండేందుకు క్రీడలను ప్రోత్సహించే అనేక చర్యలు చేపట్టారని చెప్పారు జితేందర్ రెడ్డి.
క్రీడలకు కనీవినీ ఎరుగని స్థాయిలో సీఎం రేవంత్ నిధులు కేటాయించారని చెప్పారు. ఈ క్రమంలోనే తనకు ప్రభుత్వ క్రీడా వ్యవహారాల సలహాదారు పదవి ఇచ్చినట్లు తెలిపారు జితేందర్ రెడ్డి. ఇవాళ న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సమావేశమై రాష్ట్రంలోని పలు పెండింగ్ పర్యాటక ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు జితేందర్ రెడ్డి.