క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి కోచ్‌‌‌‌‌‌‌‌లతో శిక్షణ

క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి కోచ్‌‌‌‌‌‌‌‌లతో శిక్షణ

పాలమూరు, వెలుగు: రాష్ట్రంలో చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నామని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం జిల్లా స్టేడియం గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌లో రూ.23.29 లక్షలతో ఏర్పాటు చేసిన ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్ బాల్, హై జంప్, లాంగ్ జంప్ కోర్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో క్రీడలకు అత్యుత్తమ ప్రమాణాలు కల్పించడంతోనే  కామన్వెల్త్ క్రీడల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు.

నిఖత్ జరీన్,  శ్రీజ లాంటి క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి కోచ్‌‌‌‌‌‌‌‌లతో శిక్షణ ఇప్పించడం ద్వారా గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌ సాధ్యమయ్యాయని చెప్పారు. రూ.17.32 కోట్లతో స్టేడియం నిర్మాణం చేపట్టామని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అనంతరం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ట్రైబల్ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్టల్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ముడా చైర్మన్ గంజి వెంకన్న, అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు ఉన్నారు.