రాష్ట్రంలో క్రీడా పాలసీ తెస్తున్నాం: స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి

రాష్ట్రంలో క్రీడా పాలసీ తెస్తున్నాం: స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి
  • ఘనంగా ప్రారంభమైన హైదరాబాద్ జిల్లా సీఎం కప్

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదిగేలా స్పోర్ట్స్ యూనివర్సిటీ, క్రీడా పాలసీని అందుబాటులోకి తెస్తున్నామని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. హైదరాబాద్ జిల్లా స్థాయి సీఎం కప్ 2024 క్రీడా పోటీలు సోమవారం జిమ్ ఖానా గ్రౌండ్స్ లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా శివ సేన రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు ప్రపంచ స్థాయికి ఎదిగే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

హైదరాబాద్ జిల్లా 16 మండలాలకు చెందిన సుమారు 1700 మంది పోటీల్లో ఉన్నారు.  ఈ పోటీలు 16 నుంచి 21  వరకు జరుగుతాయి.ఈ  కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజన్ ఆర్డీఓ సాయిరాం, హైదరాబాద్ జిల్లా స్పోర్ట్స్ అధికారి సుధాకర్, డిస్టిక్ సెక్రటరీ శ్రీదేవి సికింద్రాబాద్ మండల ఎస్జీఎఫ్ సెక్రటరీ రమేశ్​ గౌడ్,  కోచ్​లు  తదితరులు పాల్గొన్నారు.